![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.
పైనుండి విశ్వ పిలుస్తాడు. పట్టించుకోపోవడంతో అమూల్యకి ఫోన్ చేసి శ్రీవల్లికి ఇవ్వమని చెప్తాడు. దాంతో శ్రీవల్లి ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. నువ్వు అ పెళ్లిచూపులు ఆపకపోతే అమూల్యకి నాకు మధ్యలో నువ్వే ఉన్నావని చెప్తానని విశ్వ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో శ్రీవల్లి ఇంకా టెన్షన్ పడుతుంది. ఇప్పుడు మనకి ఆయుధం కామాక్షి అని భాగ్యం చెప్తుంది. మరొకవైపు కామాక్షి తన భర్తని షాపింగ్ కి డబ్బు ఇవ్వమని గొడవ చేస్తుంది. అప్పుడే శ్రీవల్లి తన దగ్గరికి వెళ్లి నువ్వు ఇంటికి పెద్ద ఆడపడుచువి.. నీకు తెలియకుండా ఇంట్లో మీ చెల్లికి పెళ్లి చూపులు జరుగుతున్నాయని శ్రీవల్లి చెప్తుంది.
నిన్ను పిలుస్తానంటే ప్రేమ, నర్మద వద్దన్నారు. నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నానని శ్రీవల్లి అంటుంది. నేను నీకు చెప్పినట్లు ఎవరికి చెప్పకని శ్రీవల్లి చెప్తుంది. థాంక్స్ మరదలు అని కామాక్షి చెప్తుంది. మరొక వైపు అబ్బాయి వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు. వాళ్లకు రామరాజు కుటుంబం మర్యాదలు చేస్తుంది. అదంతా ప్రేమ చూసి నాకు పెళ్లిచూపులు అయితే ఎలా ఉంటుందని ఉహించుకుంటుంది. ధీరజ్ తనని చుడడానికి వచ్చినట్లు ప్రేమ ఉహించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |